ఇటీవల కాలంలో రైలు ప్రయాణాలు అనేవి ప్రతి ఒక్కరు జీవితంలో సర్వసాధారణంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా రైల్లో ప్రయాణించే వాళ్ళు కొంతమంది ఆకతాయిలు టికెట్ లేకుండానే ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇక కొన్నిసార్లు ఇలా టికెట్ లేకుండానే ప్రయాణం చేసినప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం టికెట్ కలెక్టర్లకు దొరికిపోయి భారీగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారిని ఎంతోమందిని చూసే ఉంటారు. కానీ రైలు ఎక్కకపోయినా టికెట్ కొనేవారు ఉన్నారంటే మాత్రం ఎవరు నమ్మలేరు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి వారి గురించి. దయాల్పూర్ రైల్వే స్టేషన్లో అందరూ కూడా టికెట్ కొంటారు కానీ రైల్వే ప్రయాణం చేయరు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్  సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ను 1954లో నిర్మించారు. అయితే కోసంన్నేళ్ల తర్వాత ప్రయాణికులు లేకపోవడంతో స్టేషన్కు ఆదాయం తగ్గిపోయింది. దీంతో 2006లో దీన్ని మూసి వేశారు అధికారులు. కాగా తమ గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ ను తిరిగి ప్రారంభించాలని దయాల్ పూర్ ప్రజలు కొన్నాళ్లపాటు పోరాటం చేశారు. ఇక 2022 జనవరిలో అధికారులు ఆ స్టేషన్ తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు. అయితే ఇలా రీ ఓపెన్ చేసిన తర్వాత టికెట్లు అమ్మకాలు కొన్నాళ్లపాటు బాగానే జరిగాయి. కానీ ఆ తర్వాత మళ్లీ టికెట్లు అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఆ గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు కష్టపడి పోరాటం చేసి మళ్లీ రీఓపెన్ చేపించుకున్న రైల్వే స్టేషన్ మూతపడకుండా చేసేందుకు... ఇక అక్కడి గ్రామస్తుల స్వయంగా టికెట్లు కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టికెట్లు కొంటారు కానీ రైల్వే ప్రయాణం చేయారు ఆ గ్రామస్తులు. టికెట్లు అమ్మకాలు తగ్గిపోయినప్పుడల్లా ఇలాంటివి చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: