సినిమా పైరసి ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించిన ఐబోమ్మ రవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గత ఏడాది నవంబర్ 16న పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి విదేశాలలో ఉంటూ కొంతమందితో కలిసి ఈ పైరసీ నెట్వర్క్ ని నడుపుతున్నట్లు గుర్తించారు. తెలుగు చిత్రాలే కాకుండా ఇతర భాషలలో చిత్రాలను కూడా పైరసీ చేసి సినిమాలు విడుదలైన కొన్ని గంటలలోనే హెచ్డి క్వాలిటీతో తమ వెబ్సైట్లో ఉంచేవారని అధికారులు తెలియజేశారు. పైరసీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న రవికి న్యాయస్థానం తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసిన ఐ బొమ్మ రవి పైరసీ వ్యవహారంలో చాలామంది రవికి సపోర్టుగా నిలిచారు.


ఎన్నో రోజులపాటు కస్టడీలో తీసుకొని మరి విచారణ  చేసిన అనంతరం తాజాగా బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బెయిల్ మంజూరులో కోర్టు అత్యంత కఠినమైన ఆంక్షలు ఆంక్షలను విధించి మరి బెయిల్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతిరోజు రవి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల ముందు వచ్చి సంతకం చేయాలని, పూర్తిస్థాయిలో ఎప్పుడైనా సరే విచారణకు సహకారం అందించాలని, సాక్షాలను తారు మారారు చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.


అలాగే మరొక కీలకమైన అంశం ఏమిటంటే రవి తన పాస్ పోర్ట్ ను తక్షణమే కోర్టులో సరెండర్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు అంటూ కోర్టు ఆంక్షలు విధించింది. దీనివల్ల నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు రవి పైన ప్రత్యేకంగా ఉంచినట్లుగా సమాచారం. అలాగే మరొక కఠినమైన కండిషన్ ఏమిటంటే.. రవి ఇంటర్నెట్ అసలు ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలను చేసింది. ఒకవేల అత్యవసర పరిస్థితులలో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే, ఆ విషయాన్ని పోలీసులకు ముందస్తు అనుమతి ఇచ్చి వారి పర్మిషన్ తీసుకొని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తన తీర్పుని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: