కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆరోగ్యంగా ఉన్న మనిషి ప్రాణాలను తీసేందుకు ఎన్నో రకాల మహమ్మారులు దూసుకు వస్తూన్నాయ్. మొన్నటికి మొన్న కరోనా వైరస్ అందరిపై పంజా విసిరి ఎలా ప్రాణభయాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒకరు కూడా ఇంట్లో కరోనా వైరస్కు భయపడి దాక్కుని ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుంచి బయటపడుతున్నామని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. సడెన్ హార్ట్ ఎటాక్ లు మాత్రం అందరిని భయాందోళనలో ముంచేస్తున్నాయి.
వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోట్లు కళ్ళ ముందే చూస్తూ చూస్తుండగానే ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ లోని బిందు జిల్లాలో ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. ఉమ్రి అనే గ్రామంలో పదేళ్ల బాలుడు సాహిర్ గుండెపోటుతో మరణించడం అందరిని షాక్ కి గురిచేసింది. ఈ నెల 21న సాహిల్ చాతి నొప్పి ఉంది అని ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పేరెంట్స్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి గ్వాలియర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యమంలో నే చనిపోయాడు. అయితే అతని మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు నిర్ధారించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి