వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది చెప్పాలి. అదే సమయంలో ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల అంతే క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తుందా లేదో అని ఇక ఆ ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా భయపడుతూనే ఉన్నారు. ఇలా కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఉరిశిక్షలు విధించిన కూడా కామందుల తీరులో మార్పు రావడం లేదు. అయితే ఒకప్పుడు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలనే టార్గెట్ గా చేసుకుంటూ అఘాయిత్యాలకు పాల్పడేవారు.
కానీ ఇప్పుడు మాత్రం పక్కన కుటుంబీకులు ఉన్నా కూడా వారిపై దాడి చేసి మరి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. మహారాష్ట్రలో ఇలాంటి ఓ ఘోరం జరిగింది. సతారా జిల్లాలో ఓ బొగ్గు ఫ్యాక్టరీలో పని చేసేందుకు దంపతులు రాగా.. భర్తను బంధించి గిరిజన మహిళపై కొన్ని రోజులపాటు 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రాక్షసుల బారి నుంచి ఎలాగోలా తప్పించుకొని ఆమె భర్తతో కలిసి సొంతూరు రాయగడ్ కు చేరుకుంది. ఇక జరిగిన విషయంపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ప్రధాన నిందితుడైన ఫ్యాక్టరీ యజమానిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాయంపు చర్యలు చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి