విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివే. ఏదో మన జీవితంలో మనం బ్రతుకుతున్నామని అందరూ అనుకుంటారు. కానీ విధి ఆడుతున్న నాటకంలో మనం కీలుబొమ్మల్లాగా ఆడుతున్నాం మాత్రమే అన్న విషయం పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇదంతా ఒట్టి మాటలు.. ట్రాష్ అని నేటి రోజుల్లో జనాలు కొట్టి పారేసిన వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇక నిజంగానే మనిషి జీవితం ఒక నాటకం. విధి చేతిలో మనిషి కీలుబొమ్మలాంటివాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది.


 ఎందుకంటే సాధారణంగా తల్లి కడుపు నుంచి ఈ భూమ్మీదకి వచ్చిన తర్వాత వృద్ధాప్యం వస్తేనో.. లేకపోతే పెద్ద ఆరోగ్య సమస్య వస్తేనో.. ప్రాణాలు పోతాయి అని అందరూ నమ్మేవారు. కానీ ఇటీవల కాలంలో విధియాడిన నాటకంలో ఎప్పుడు ఎవరి ప్రాణాలు ఎలా పోతాయి అన్నది కూడా ఊహకిందని విధంగానే మారిపోయింది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు సైతం.. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరి మనసు చలించిపోతూ ఉంటుంది. ఆ దేవునికి కాస్తైనా దయలేదా ఇలాంటి చిన్నారి ఏం పాపం చేసింది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. అనూహ్య రీతిలో ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఏకంగా సెల్ఫోన్ చార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని చిన్నారి కరెంట్ షాక్ కొట్టి మరణించింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కార్వార్ తాలూకా సిద్దరాద గ్రామానికి చెందిన సంతోష్, సంజనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే పెద్ద కూతురు బర్త్ డే వేడుకల్లో భాగంగా కుటుంబమంతా ఇక పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే 8 నెలల సానిత్య స్విచ్ బోర్డుకు పెట్టిన చార్జర్ ను నోట్లో పెట్టుకుంది. అయితే స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: