ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఏ మూలన ఏ చిన్న ఘటన జరిగిన కూడా అది ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఎన్నో రకాల వీడియోలు అటు సోషల్ మీడియాలోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియాలోకి వచ్చిన విషయాలు కొన్నింటిపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తే.. ఇంకొన్ని ఘటనలపై మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.


 ఇక ఇప్పుడు ఒక మహిళ, పోలీస్ అధికారికి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక సామాన్య మహిళా పోలీసును చెప్పుతో కొట్టింది.  అయితే ఆమె అలా ఎందుకు పోలీస్ అధికారిని కొట్టింది అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అయితే మహిళ ఇలా చెప్పుతో దాడి చేయడంతో కోపంతో ఊగిపోయిన పోలీస్ అధికారి ఆమెపై ఎదురు తిరిగాడు. చివరికి ఊహించిన విధంగా సదరు మహిళపై దాడి చేసే ప్రయత్నం చేశాడు పోలీస్ అధికారి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది అన్నది తెలుస్తోంది.


 ఒక మహిళ మార్కెట్లో వస్తువులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో.. ఒక పోలీసు ఆమె వస్తున్న ఆటోని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ వారి మధ్య గొడవ మొదలైంది  అయితే చూస్తూ చూస్తుండగానే ఇద్దరి మధ్య గొడవ పతాక స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్ళింది. అయితే ఆ పోలీస్ అధికారి ముందు ఆ మహిళతో ఎలా ప్రవర్తించాడో తెలియదు కానీ.. ఆమె మాత్రం ఆ పోలీసును చెప్పుతో కొట్టింది. దీంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన పోలీస్ అధికారి ఆమెను కాలితో తన్నాడు. అక్కడున్న మిగతా పోలీసులు అతడిని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ లో వైరల్ గా మారింది. పోలీస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆమె మిగతా పోలీసులకు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: