
ఇందుకోసం ఇక గర్భం దాల్చిన మహిళకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి ఒప్పందం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాల్సి ఉంటుంది. దీనినే సరోగసి పద్ధతి అంటారు. విదేశాలలో ఇలాంటి సరోగసి పద్ధతి ఎక్కువగా వాడుకలో ఉంది అని చెప్పాలి. కానీ ఇండియాలో మాత్రం సరోగసి పద్ధతి పై నిషేధం కొనసాగుతుంది. అయినప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డలను కంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఎక్కువమంది సెలబ్రిటీలు అందం కాపాడుకోవడానికి లేదంటే ఇతర కారణాలతో ఇలా సరోగసి పద్ధతి ద్వారానే బిడ్డలను కంటున్నారు.
అయితే ఇక సరోగసిపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ సరోగసి వ్యవస్థను భారతదేశంలో ప్రోత్సాహించాల్సిన అవసరం లేదు అంటూ ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇండియాలో సరోగసి చట్ట సవరణలు సవాల్ చేస్తూ కెనడాలో ఉంటున్న భారతీయ సంతతి దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరోగసి ఇండస్ట్రీని ఇక్కడ ప్రోత్సహిస్తే బిలియన్ డాలర్లకు విస్తరిస్తుంది. మీరు కెనడాలో ఉన్నారు. ఈ విషయంలో ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని అడగండి స్పష్టం చేసింది హైకోర్టు.