ఇజ్రాయెల్ దెబ్బకి గాజా నుంచి హమాస్ తీవ్రవాదులతో పాటు సాధారణ ప్రజలు తరలి వెళ్తున్నారు. తీవ్రవాదులనే నెపంతో ఏ అరబ్ దేశం కూడా వీరికి ఆశ్రయం కల్పించేందుకు ముందుకు రావడం లేదు. తీవ్రవాదులు కూడా జనం మధ్యనే ఉంటూ విధ్వంసం సృష్టించి.. మళ్లీ జనంలో కలసిపోయి ఇతర దేశాలకు వెళ్తుంటారు. మళ్లీ అక్కడ దాడులు చేస్తారు. అందుకే ఏ అరబ్ దేశం కూడా వీరిని రానివ్వడం లేదు.
57 అరబ్ దేశాలు ఉన్నాయి. గాజాలో సుమారు 12 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాను ఆయా దేశాలు తలాకొంత సుమారు 50వేల మందికి ఆశ్రయం కల్పిస్తే ఏ సమస్య ఉండదు. కానీ ఆ సాహసం ఎవరూ చేయడం లేదు. ఎందుకంటే పాలు పోసి పామును పెంచడానికి ఏదేశం మాత్రం ముందుకు వస్తుంది. అదీ కాకుండా హమాస్ తీవ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెతికి మరీ చంపుతామని హెచ్చరికలు పంపింది. ఇది పరోక్షంగా అరబ్ దేశాలను ఉద్దేశించి చేసిన ప్రకటనే.
తాజాగా ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాన్ని ఆపేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ పతా సదస్సును ఏర్పాటు చేశారు. గాజాకు సహాయం అందించేందుకు సహకరించాలని.. కాల్పుల విరమణ ప్రకటించాలని.. పాలస్తీనా, ఇజ్రాయెల్ శాంతి చర్చలు తిరిగి ప్రారంభించాలని సూచించారు. తమ భూ భాగంలోకి మాత్రం గాజా వాసులను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అంటే వీరంతా ఇజ్రాయెల్ లోకి వెళ్లి ఎలాంటి విధ్వంసానికి అయినా పాల్పడవచ్చు కానీ తమ దేశంలోకి మాత్రం రాకూడదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి