ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తాజాగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒక స్థానం ఎస్టిలకు ఇస్తూ జగన్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. వేరే పార్టీల వారైతే ఈ ఎమ్మెల్సీ స్థానాల విషయంలో చేసిన ఈ మార్పులకు చాలా హంగామా చేసేవారు. కానీ బీసీలకు భారీగా స్థానం కల్పించబోతున్నారనే ఈ విషయం కూడా కొన్ని రోజుల నుంచి ఏ హడావుడి లేకుండా నిశ్శబ్దంగా నానుతూ వస్తుంది. అయితే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని పన్నినట్లుగా తెలుస్తుంది.


దానిలో భాగంగానే ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభి, ఇంకా బొత్సా వెంకన్న, అలాగే బచ్చుల అర్జునుడి సోదరుడు చిన్నా వీళ్ళందరూ వంశీని బూతులు తిట్టడం మొదలుపెట్టారు. వంశీకి మీడియా కవరేజ్ బాగా ఉండడం వల్ల వీళ్ళందరూ భారీ ఎత్తున వంశీ పై మాటలు దాడితో గందరగోళం సృష్టించి అసలు విషయాన్ని డైవర్ట్ చేశారని తెలుస్తుంది. ఈ విషయం జరిగిన వెంటనే టీడీపీ అనుకూల మీడియా వరుసగా దీనిపై వార్తలను వేస్తూ అసలు విషయాన్ని ప్రక్కతోవ పట్టేలా చేసేసాయి. ఇందులో తిలాపాపం తలాపిడుకెడు.‌ ఇదంతా ఒక ఆవేశంలో జరిగింది కాదని, అవతల వారి వ్యూహం అని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది తెలుగుదేశం యొక్క వ్యూహం అని తెలుస్తుంది.


ఇక్కడ అసలు విషయం ఏమిటంటే బుద్దా వెంకన్న ఇంకా చిన్నా వీళ్ళిద్దరూ కూడా బీసీ వర్గానికి సంబంధించిన వారే. వీళ్లందరి ప్రధాన ఉద్దేశం అయితే వంశీని ఇలా బూతులు తిట్టి రెచ్చగొట్టడం. అలాగే బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రాజెక్ట్ చేయడం కూడా ఒక ఉద్దేశం. గతంలో ఈ సామాజిక న్యాయం చేసింది సీనియర్ ఎన్టీఆర్ అయితే ఆ తర్వాత ఇప్పుడు జగన్ అని చెప్పుకోవాలి మధ్యలో చిరంజీవి ఈ సామాజిక న్యాయం చేద్దామని అనుకున్నా ఆయనకు వీలుపడలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: