
ఇది కేసీఆర్ వ్యుహాంగానే రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ ఎస్ బలంగానే ఉంది. దీనికి తోడు టీవీ9 అండ ఎలాగో ఉంది. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో టీవీ9 వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం బీఆర్ ఎస్ తో పూర్తి సపోర్టుగానే ఉంది. ఈ సమయంలో కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలను టీవీ9 ప్రజల ముందు ఉంచుతోందని తెలుస్తోంది.
తెలంగాణలో మళ్లీ ఎలాగైన అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాలు గానే కనిపిస్తోంది. అయితే ఒకవేళ రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన నాయకులు టీఆర్ ఎస్ పేరుతో పార్టీ పెట్టినా వారికి ఎన్ని ఓట్లు పడతాయి. ఎంతమంది అభిమానం వారు సంపాదించుకుంటారు. అసలు ఈ టీఆర్ ఎస్ కొత్త పార్టీ వెనక ఉన్న కథేంటి.. ఓటర్లను తికమక పెట్టి ఇక్కడ ఎదుగుతున్న బీజేపీ, కాంగ్రెస్ లను మట్టికరిపించేందుకు సీఎం కేసీఆర్ ఆడుతున్న నాటకంలా అనిపిస్తుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రక్రియలో కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి బీజేపీ, బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొందని ఇప్పటికే తెలుస్తోంది. కానీ ఊరు పేరు తెలియని నాయకులు కలిసి టీఆర్ ఎస్ అని పార్టీ పెట్టినంతా మాత్రాన వారికి ఓట్లు పడతాయనుకోవడం పొరపాటే అవుతుంది. మరి కొత్త టీఆర్ ఎస్ పార్టీని ఎవరు పెడతారో చూడాలి.