యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా పేరు సంపాదించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయంగా ఉంటూ వస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఒక్క ఏడాది కాలంలోనే జగన్ మార్క్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకు చేసి చూపించారు. తాను మాటలు సీఎం ని కాదని, చేతల సీఎంని అనే విషయాన్ని రుజువు చేసుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే, అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలో ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఎవరికీ దక్కలేదు. అది సీఎం జగన్ కు మాత్రమే దక్కింది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తూ, వాటిని అనుసరించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా జగన్ వ్యవహరిస్తూ, తమ రాజకీయ ప్రత్యర్ధులతో కూడా శభాష్ అనిపించుకున్నారు. 

IHG

 

గత రాజశేఖర్ రెడ్డి పరిపాలనను పేదలు, రైతుల స్వర్ణయుగంగా ఏవిధంగా అయితే చెప్పుకున్నారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జగన్ పరిపాలనను ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. ఇదంతా నాణానికి ఒక వైపు కోణం అయితే, మరో వైపు కోణంలో చూస్తే జగన్ ప్రతి విషయంలోనూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఫలితం ఎలా ఉంటుంది అనేది అంచనా వేయకుండా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తన మనసులో ఏ ఆలోచన వచ్చిందో దానిని అమలు చేసి చూపిస్తున్నారు. ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ అంతే స్థాయిలో కఠినంగా ఉంటూ వస్తున్నారు. తాను ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయం తీసుకున్నా అని, ఆ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదనే మొండి పట్టుదలతో జగన్ ముందుకు వెళుతున్న విధానం తిరిగి తిరిగి ఆయనకే చెడ్డపేరు తీసుకు వస్తోంది.

 

IHG


 గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేవే. అయినా ప్రతిపక్షాలు ఈ విషయాలను పెద్ద ఎత్తున రాద్దాంతం చేయడం, కోర్టుకు ఎక్కడం వంటివి చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తొందరపాటుతో తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు జగన్ అమలు చేద్దాం అనుకున్న ఎన్నో నిర్ణయాలను కోర్టులు తప్పుపడుతూనే వస్తున్నాయి. తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ జగన్ ఇదే మొండి వైఖరితో ముందుకు వెళ్ళారు. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారనే అనుమానంతోనూ, పార్టీలను సమావేశపరిచి ఎన్నికలను వాయిదా వేస్తున్నాను అనే విషయం చెప్పకుండా, అకస్మాత్తుగా ఆ నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు అప్పట్లో జగన్ కు ఆగ్రహం కలిగించాయి. 

 

IHG


ఇక ఆలస్యం చేయకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ఆమోదం పొందించుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే తప్పించి కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా జగన్ ఆగమేఘాల మీద నియమించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పై కోర్టుకు వెళ్లడంతో,హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. కాకపోతే ఆ తీర్పు చెల్లదని వైసీపీ ప్రభుత్వం చెప్పడంతోపాటు ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ను ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. 

IHG


రాజ్యాంగమైన వ్యవస్థలతో ఆడుకోవడం మంచిది కాదంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించాలని ఆర్డినెన్స్ ను ఎలా ఆమోదిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక ప్రభుత్వం ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని, ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే హై కోర్ట్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసి గా కొనసాగాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

IHG


 ఆయన బాధ్యతలు చేపట్టకుండా ఆపడం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వల్ల కాని పని. ఇప్పుడు ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అభాసుపాలైంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పడుతూ ఉండగా, ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే విధంగా తీర్పులు రావడం, విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టడం, వరుసగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతుండడం  ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధులకు బూస్ట్ ఇచ్చే అంశాలుగా మారిపోయాయి. ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహారం ఒక్కటే కాదు, జగన్ తీసుకున్న నిర్ణయాలు కోర్టులు తప్పు పడుతుండటం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు. 

 

IHG's problems- The New <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> ...


ఈ విషయాలపై ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రజలకు మంచి చేసేవే  అయినా, ఆ నిర్ణయాలు అమలుకంటే ముందే ఎటువంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా న్యాయనిపుణులతో చర్చించి, రాజ్యాంగం ప్రకారం జగన్ నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహారం జగన్ కు ఓకే గుణపాఠమే. ఈ గుణపాఠం నుంచి జగన్ పాఠాలు నేర్చుకుంటాడో లేఖ యథావిధిగా దూకుడుని ప్రదర్శిస్తాడో చూడాలి. దానిని బట్టే పార్టీ, ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: