ఏపీ టీడీపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారంపై టీడీపీ, వైసీపీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతుంది. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడ్ని టార్గెట్ చేస్తూ.. ‘కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి.

 

అయితే తాజాగా దీనిపై ఎంపీ రామ్మోహ‌న్ స్పందిస్తూ.. ఘాటు ట్వీట్‌తో విజయసాయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు.సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ”ఛీ” కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మమ అప్రూవర్గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు,ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.. మూడు ముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు విజయసాయిరెడ్డి గారు’అంటూ మండిపడ్డారు.

 

మొత్తంగా వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏవో పెను మార్పులే చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రామ్మోహన్ ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే, మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి..? ఇది చంద్రబాబు మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే..రామ్మోహన్ కు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. వాటికి తోడు ఆయన మాట్లాడే విధానం, రాజకీయాల పట్ల ఆయనకున్న అవగాహను చూసి తెలుగుతమ్ముళ్ళు ఆయనకు ఆకర్షితులైతే.. చినబాబు పరిస్థితి ఏంటని చంద్రబాబు ఆలోచిస్తున్నారాట. కాబట్టి రామ్మోహన్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: