ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం.. ఇది దాదాపు తెలుగు జర్నలిజం మర్చిపోయిన మాట.. టీవీ చానళ్లు వచ్చిన కొత్తలో టీవీ, ఎన్టీవీ, ఈటీవీ వంటివి పోటీపడి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేశాయి. ఎన్నో చీకటి కోణాలను వెలికి తీశాయి. బాధితులు ఇచ్చే సమాచారం ఆధారంగా అక్రమార్కుల పని పట్టేవి... ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వార్తలకు రెండువైపులా పదును ఉంటుంది. వీటి వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఛానళ్ల క్రెడిబిలిటీ పెరుగుతుంది. జర్నలిజంపై ప్రజలకు నమ్మకమూ కలుగుతుంది.

కానీ ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్న విషయాన్నే చానళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తోంది. అయితే ఇటీవల టీవీ9 మరోసారి తాము బ్రహ్మాండం బద్దలు కొట్టేశాం అన్న రేంజ్‌లో ఆపరేషన్ చార్లీ పేరుతో ప్రోమోలు కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ అంశంపై టీవీ9 మీడియా నిఘాలో సంచలన విషయాలు వెలుగు చూశాయని ప్రోమోలు ఇవ్వడంతో జనం అలర్టయ్యారు. అబ్బో టీవీ9 ఏదో కుమ్మేయబోతోందిగా అనుకున్నారు.

ఆపరేషన్ చార్లీ గురించి ఒక రేంజ్ లో ట్రైలర్ చూపించింది. ఎక్స్ప్లోజివ్ బాంబ్ అంది. మీడియా చరిత్రలో సంచలనం సృష్టించే ఆపరేషన్ చేశామని ఊదరొగట్టింది. సంచలనాత్మకమైన కథనాలను ప్రసారం చేయబోతున్నామని ఊరించింది. అయితే ఆ నమ్మకాన్ని టీవీ9 నిలబెట్టుకోలేకపోయింది. ఇంతా చేసి చివరకు టీవీ9 చూపించింది ఏంటయ్యా అంటే.. గోవాలో డ్రగ్స్ దొరుకుతున్నాయి అని. గోవాలో ఇలాంటి వ్యవహారాలు కామన్ అన్న సంగతి చాలా మందికి తెలుసు.

ఆ ప్రోమోలు చూసిన వారికి.. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ గుట్టు విప్పుతారామో అని ఆశించిన ప్రేక్షకులు ఓస్ ఇంతేనా.. ఈ మాత్రం దానికే అంత బిల్డప్పా అని సణుక్కుంటున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల‌లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి.. ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు. సినిమా సెలబ్రెటీల సంగతేంటి.. రాజకీయ నాయకుల ప్రమేయం ఎంత.. ఇలాంటి విషయాలపై శోధిస్తే అప్పుడు స్టోరీ ఓ రేంజ్‌లో ఉండేది.. కానీ టీవీ9 మాత్రం ఈ విషయంలో బాగా నిరుత్సాహపరించిందంటున్నారు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: