ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఇన్ని సంవత్సరాలకు నిజాన్ని మొదటిసారి అంగీకరిచాంరు. అదికూడా కుప్పంలో ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఆ నిజాన్ని అంగీకరించటం ఆశ్చర్యం కలిగించింది. ఇటీవలే ముగిసిన పంచాయితి ఎన్నికల్లో కుప్పంలోని 89 పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు 74 పంచాయితీలను గెలవటం సంచలనంగా మారింది. చంద్రబాబు కుప్పం కోటకు బీటలు పడిన విషయం స్పష్టంగా బయటపడింది. ఇంతకాలం ఏకపక్ష రాజకీయాలతో ప్రత్యర్ధి పార్టీలను ప్రలోబాలకు గురిచేస్తు చంద్రబాబు ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇదే విధమైన రాజకీయాలను చంద్రబాబు దాదాపు 35 ఏళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నారు.  అలాంటిది మొదటిసారి టీడీపీ రాకీయానికి ఎదురుదెబ్బ తగిలింది.




ఎదురుదెబ్బ కారణంగా ఉలిక్కిపడిన చంద్రబాబు పరుగు పరుగును మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించారు. అయితే తన పర్యటన మొత్తాన్ని వైసీపీపై బురద చల్లటానికే ప్రయత్నించినా ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాత్రం నిజాన్ని అంగీకరించారు. పార్టీలో నేతలు గ్రూపులవారీగా చీలిపోవటం, నేతలెవరు పార్టీ విజయానికి కష్టపడి పనిచేయకపోవటం వల్లే పార్టీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారంటు అందరిపైనా చంద్రబాబు మండిపడ్డారు. నాయకులు పనిచేయకపోవటం వల్ల పంచాయితి ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారనే నిజాన్ని చంద్రబాబు చివరకు అంతర్గత సమావేశాల్లో అయినా అంగీకరించటం సంతోషకరం.




ఎప్పుడు ఓటమి ఎదురైనా అందుకు బాధ్యతను ఎదుటివారిపై నెట్టేయటమే చంద్రబాబుకు తెలిసింది. ప్లస్సులన్నీ తన ఘనతగాను, మైనస్సులన్నీ నేతల ఖాతాలోనే జమచేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమిని కూడా ప్రజాస్వామ్యం ఓటమంటూ సొల్లు కబుర్లు చెప్పారు. అయితే ఓటమి ఎదురైనపుడు నిజాయితీగా కారణాలను విశ్లేషించుకునే ధైర్యం చంద్రబాబులో లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతసేపు ఓటమికి ఎదుటివాళ్ళదే తప్పని చెప్పటం తప్ప తనలోని లోపాలను అంగీకరించటానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏరోజు ఇష్టపడరు. నిజానికి పార్టీకి బలమైన క్యాడర్ పెద్ద అసెట్ అనే చెప్పాలి. దాన్ని నేతలే చేజేతులా పాడు చేసుకుంటున్నారు. దీనికి చంద్రబాబు విధానాలే నూరుశాతం కారణం. కాబట్టి తనలోని లోపాలను నిజాయితీగా అంగీకరించి తప్పులను సరిచేసుకుంటే పార్టీ బలోపేతమవటం పెద్ద కష్టంకాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: