కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం మనది..200 వరకూ దేశాలున్న  ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ కు ఇప్పటి వరకూ 7,8 రకాల కంపెనీలు మాత్రమే టీకాలు రూపొందించాయి.  అలాంటి దేశాల్లో ఇండియా ఒకటి.. అయితే.. ఇండియా వ్యాక్సిన్ రూపొందించినా.. భారత జనాభా మొత్తానికి వ్యాక్సిన్ అందించడం అంత సులభమైన ప్రక్రియ కాదు. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశం మనది. అయితే.. భారత్‌లో కేవలం ఒకే ఒక్క కంపెనీ సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసింది. అదే భారత్ బయోటెక్. మరో కంపెనీ సీరం ఆక్స్ ఫర్డ్‌ సంస్థ రూపొందించిన టీకాను ఇండియాలో ఉత్పత్తి చేస్తోంది.

మొత్తం మీద ఈ రెండు కంపెనీల నుంచి వ్యాక్సీన్ భారత్ మొత్తం అందాలి. ఆ రెండు సంస్థలు యుద్ధ ప్రాతిపదికన అన్ని వనరులూ సమకూర్చుకుని 24 గంటలూ ప్రోడక్షన్ చేస్తున్నా.. వ్యాక్సీన్ల రోజువారీ ఉత్పత్తి అంతంత మాత్రమే. మరి ఇలాగైతే మన దేశంలోని అందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు అందాలి.. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతున్న ప్రశ్నలు ఇవే. ఇదే సమయంలో ఇండియాలో ఫార్మా సంస్థలకు కొదవు లేదు. వందల సంఖ్యలో ఫార్మా సంస్థలు ఉన్నాయి. అయితే వాటి దగ్గర కరోనా వ్యాక్సిన్ టెక్నాలజీ లేదు.

అందుకే ఏపీ సీఎం జగన్.. ఓ అద్భుతమైన సూచన ప్రధానికి చేశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఏపీకి అదనంగా ఆక్సిజన్‌ కేటాయించాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ‘పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి, దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాగ్జిన్‌ ఒక్కటేనని జగన్ తన లేఖలో తెలిపారు.

భారత్ బయోటెక్‌కు వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించాయి. ఇప్పుడు భారత్ బయోటెక్‌ వ్యాక్సిన్‌ టెక్నాలజీని ఇతర కంపెనీలకు అందిస్తే.. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయవచ్చు. మరి మోదీ ఈ ఐడియాపై ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: