అయితే.. కొన్ని నెలలుగా తెలంగాణలో బీజేపీ బలపడుతూ వస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ వంటి అనేక ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్‌ను మట్టికరిపించింది. అందుకే కేసీఆర్ వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తన బలంపై ఆయనకు నమ్మకం ఉన్నా.. ఎందుకైనా మంచిదని ఆయన దేశంలోనే రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ ఎంతటి చాణక్యుడైనా.. కొన్ని విషయాల్లో ఆయన విశ్వసనీయత కోల్పోయారు. ప్రత్యేకించి ఆయన మోనార్క్‌గా వ్యవహరిస్తారని.. సరికొత్త రాజరికం చూపించారని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. రాజకీయంగా స్థిరత్వంలేని పోకడలు కూడా ఆయనకు చెడ్డపేరు తెచ్చాయి. ప్రత్యామ్నాయం అంటూ ఒకటి సరిగ్గా కనిపిస్తే.. కేసీఆర్ ను పక్కకు పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ.. ఆ సరైన ప్రత్యామ్నాయం మాత్రం ఇంకా ధృఢంగా కనిపించడం లేదు.
అందుకే.. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్.. పీకే సేవలు వినియోగించు కోవాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. పీకే ఇప్పటికే అనేక సార్లు తన సత్తా చాటుకున్నారు. ప్రత్యేకించి బెంగాల్‌లో బీజేపీ ఎంతగా పోరాడినా.. మూడోసారి వరుసగా మమతా బెనర్జీని అధికారంలో కూర్చోబెట్టగలిగారు. పీకేలో కేసీఆర్ కు కావాల్సిన గుణం కూడా ఇదే కావడం విశేషం. అందుకే.. పీకే సేవలు వినియోగించుకుంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి