దేశంలోనే విశిష్టత కలిగిన దేవాలయంగా తీర్చి దిద్దారు. అందుకు ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆలయ పునర్మిర్మాణంలోని ప్రతి అడుగులో ఆయన హస్తం ఉంది. ఆలయ నమూనాల దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి దగ్గరుండి మరీ చూసుకున్నారు.. కేసీఆర్ తరచూ చెబుతున్నట్టు కుర్చీ వేసుకుని కూర్చుని మరీ యాదాద్రిని కట్టించారు. తరతరాలకు తన పేరు చరిత్రలో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ ఈ యాదాద్రి పునర్మిర్మాణంతో చేసుకున్నారు. అందులో సందేహం లేదు.
అయితే.. యాదాద్రికి సంబంధించిన ప్రతి విషయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగానే చేశారు. అలాంటిది యావత్ నిర్మాణం పూర్తయ్యాక.. ఆలయం పునః ప్రారంభ కార్యక్రమం మాత్రం అత్యంత సాదాగా కానిచ్చేస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది.. గతంలో సీఎం కేసీఆరే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు.. ఆయన ప్రారంభం అదిరిపోయేలా చేసుకుందామన్నారు. అందుకు ముందుగానే ఆయన ప్రధానిని కూడా స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చారు.
యాదాద్రి పునః నిర్మాణం తరహాలో ఆధునిక కాలంలో ఏ గుడిని నిర్మించలేదని చెప్పాలి.. అలాంటి కార్యక్రమాన్ని ప్రధానితో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి.. మహా మహా స్వామీజీలను పిలిచి అట్టహాసంగా చేసి ఉండాల్సింది.. అసలు అలా చేస్తారనే అంతా అనుకున్నారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం... అంతా పూర్తయ్యాక..అసలు కార్యక్రమం సాదాసీదాగా నడిపించేశారు. ఎందుకన్నది మాత్రం అంతుబట్టకుండానే ఉంది. చినజీయర్ స్వామితో విబేధాలే ఇందుకు కారణమా.. మోడీతోనూ విబేధాలు ఉన్నందువల్ల మళ్లీ పిలవలేకపోయారా..ఏమో.. అంతా ఆ కేసీఆర్‌కే ఎరుక.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి