ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి.. ఆ రైతు కుటుంబాలను ఓదారుస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పార్టీ తరపున పరిహారం ఇస్తున్నారు. పార్టీ తరపున తానే రూ. లక్ష ఇచ్చి ఆదుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీస్తున్నారు. అయితే.. ఈ అంశంపై ఇటీవల జగన్ ఓ సభలో ఎదురు దాడి చేశారు. ప్రభుత్వం నుంచి  పరిహారం పొందని ఒక్క రైతు కుటుంబాన్నయినా దత్త పుత్రులు చూపిస్తారా అని ప్రశ్నించారు.


అయితే.. ఇది కేవలం ఎదురుదాడిగా మాత్రమే పనికొస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే జనసేన అధినేత అలాంటి వారి జాబితా రూపొందించారు. వారిలో ఒక్కొక్కరికీ వెళ్లి సాయం చేస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం ఇప్పటికే సాయం చేసి ఉంటే.. ఆ వివరాలు ధైర్యంగా బయటపెడితే బావుంటుంది. అంతే కాకుండా తాము ఆర్థిక సాయం చేసినవారికి సంబంధించిన వివరాలు, పోలీసు రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తామంటున్నారు జనసేన నేతలు.. తాము ఆ రికార్డులు సూచిస్తే సిబిఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకొంటారు? అని ప్రశ్నిస్తున్నారు.


వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా, రైతు శ్రేయస్సు పట్టించుకోకుండా చేస్తున్న పరిపాలన వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని జనసేన నేత మనోహర్ ఆరోపిస్తున్నారు.  ఈ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టం- కౌలుకి వ్యవసాయం చేసుకొనే పేదలకు రుణాలు కూడా రాకుండా చేస్తోందని విమర్శిస్తున్నారు. కౌలు రైతులకు ఇచ్చే అర్హత కార్డులు రాకుండా చేస్తున్నారని.. అందువల్ల వారికి బ్యాంకులు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా ఏవీ వర్తించడం లేదని అంటున్నారు.


ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికీ రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నిస్తోంది. చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి, గొప్పలు చెప్పుకొన్నా రైతులు విశ్వసించరంటున్నారు జనసేన నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: