తెలంగాణాలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అవసరమైన వ్యూహాలన్నీ రచిస్తోంది. తనకు కేంద్రంలో ఉన్న బలాన్ని కూడా ఇందుకు ఉపయోగిస్తోంది. తెలంగాణ లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే మామూలు విషయం కాదన్న సంగతి అమిత్ షా వంటి పెద్దలకు తెలుసు. అందుకే క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


ఇందులో భాగంగా.. తెలంగాణను కొన్ని క్లస్టర్లుగా విభజించి మరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ బాధ్యతలు కేవలం రాష్ట్ర నాయకులకే కాకుండా కేంద్ర నాయకులకు కూడా అప్పగిస్తున్నారు. 17 పార్లమెంట్లను నాలుగు క్లస్టర్ గా విభజించిన బీజేపీ అగ్రనేతలు.. ప్రతి క్లస్టర్ కు మూడు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఒక కేంద్ర మంత్రిని నియమించారు.


ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ క్లస్టర్ ఇన్ చార్జీగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను నియమించారు. హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, భువనగిరి క్లస్టర్ ఇన్ చార్జీగా  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించారు. మహబూబూ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండకు క్లస్టర్ ఇన్ చార్జీగా కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండేని నియమించారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలకు క్లస్టర్  ఇన్ చార్జీగా కేంద్ర మంత్రి బీఎల్ వర్మకు బాధ్యతలు అప్పగించారు.


వీటితో పాటు ప్రతీ పార్లమెంట్ కు ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రిని నియమించారు. ఈ బాధ్యతలు ఎవరికి అంటే.. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల.. జహీరాబాద్ కు నిర్మల్ సీతారామన్.. మెదక్ కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ... చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి.. భువనగిరికి దేవీసింగ్ చౌహాన్.. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ కు మహేంద్ర నాథ్ పాండే.. నల్లగొండకు కైలాశ్ చౌదరి.. వరంగల్ కు ఇంద్రజిత్ సింగ్.. హైదరాబాద్ కు జ్యోతిరాధిత్య సింధియా .. మహబూబాబాద్, ఖమ్మం కు బీఎల్ వర్మ.. ఇలా బాధ్యతలు అప్పగించారు. మరి ఈ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr