తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుస్తామని.. గత ఏడాది లాగానే పది రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వారాలు అందుబాటులో ఉంటాయని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పది రోజులకు సంభందించి తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ ప్రక్రియ చేస్తామని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.


అలాగే జనవరి 2 న రాజ్యాంగ హోదాలో విఐపీలు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు.  జనవరి 2 నుండి 11 వ తేదీ వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టోకన్లు కేటాయిస్తామన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. జనవరి 1వ తేదీ సర్వదర్శనం టోకన్లు కౌంటర్ ప్రారంభ అయ్యి టోకన్లు పూర్తయ్యేదాకా తిరుపతిలో కౌంటర్లు తెరచివుంటాయని తెలిపారు.


వైకుంఠ ద్వార దర్శనానికి సంభందించి రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల రూ 300 దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ లో కేటాయిస్తామని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం 331 ఆలయాలు నిర్మాణ దశలో ఉన్నాయని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. మరో 1100 పైగా ఆలయాలను త్వరితగతిన నిర్మాణాలు చేయాలని నిర్ణయించామని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  వివరించారు. టీటీడీ ఆసుపత్రుల్లో ఔషధాలు, సర్జికల్ పరికరాలు కొనుగోలుకు రూ 2.86 కోట్లు మంజూరు చేశామని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  వివరించారు.


సామాన్య భక్తులను దృష్టి ఉంచుకొని బ్రేక్ దర్శన సమయం మార్చామని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. ఉదయం 8 గంటలకు వీఐపీ దర్శన సమయం ఉంటుందన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. నందకం అతిధి గృహంలో  ఫర్నిచర్ల మార్పుకు 2.95 కోట్లు ఆమోదించామన్నారు. రెండో కనుమ దారిలో రక్షణ గోడలకు 9 కోట్లు మంజూరు చేశామన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ... జమ్ము కాశ్మీర్ లో నిర్మిస్తున్న ఆలయ ఘాట్ రోడ్డు నిర్మాణం,భక్తుల సౌకర్యార్థం పలు పనులకు 7 కోట్లు ఆమోదించినట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: