రాంగోపాల్ వర్మ ఒకప్పుడు పెద్ద డైరెక్టర్.. ఇది మన అందరికి తెలిసిన విషయమే కానీ ఈయన డైరెక్టర్ కంటే వివాదాస్పద అంశాల్లోనే తెలుగు ప్రజలకు ప్రస్తుతం సుపరిచితుడుగా మారాడు. గతంలో టిడిపి సినీ ప్రముఖులను ఉపయోగించుకొని రాజకీయాల్లో వారి సేవలను ఉపయోగించుకుంది. చాలామంది ఎన్నో రకాలుగా ఇతర పార్టీలపై విమర్శలు చేశారు. ఉదాహరణకు శివాజీ, దివ్యవాణి వీరి వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమైనా లాభం జరిగిందా? ఒకవేళ లాభం జరిగితే ఎంతవరకు జరిగింది. లాభం కాదు కదా నష్టం జరగకుండా ఉంటే అదే వెయ్యి రేట్లు మేలు.



ఎవరో వచ్చి ఏదో విమర్శ చేసినంత మాత్రాన ప్రజలు ప్రతిదీ గుడ్డిగా నమ్మేకాలం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్లలో ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలు లేక బూతు సినిమాలు తీసుకుంటూ తన స్థాయిని దిగజార్చుకొని ప్రజల్లో విమర్శల పాలవుతున్నటువంటి వర్మాని వైసీపీ గనక ఉపయోగించాలనుకుంటే పప్పులో కాలేసినట్లే. పవన్ కళ్యాణ్ ని విమర్శించాలనుకుంటే వర్మని ఉపయోగించుకోవాలనుకోవడం వైసిపి చేస్తున్న పొరపాటే అవుతుంది. రాజకీయాలు వేరు సినిమా వేరు అక్కడ విమర్శలు వేరు ఇక్కడ విమర్శలు వేరుగా ఉంటాయి.



వర్మ చెబితే విని నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. వర్మని వాడుకొని పార్టీని బలోపేతం చేయాలనుకుంటే మాత్రం గతంలో టిడిపికి జరిగిన అనుభవమే వైసీపీకి కూడా కచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వైసీపీ వర్మను ఉపయోగించుకుంటుందా ఉపయోగించుకోదా ఒకవేళ వర్మని వాడుకోవాలని ఉన్నా, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే అవకాశం ఉంటుంది. జగన్ ఎప్పుడు చెప్పే మాట ఏంటి ప్రజల్లో విశ్వసనీయత పార్టీ పైన ప్రభుత్వం పైన ఉండేలా పాలన కొనసాగాలి. అదే పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుతుందని నమ్ముతారు. మరి అలాంటి విశ్వాసాలను పాటించే పార్టీ వర్మని వాడుకోవాలనుకోవడం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వర్మ వైసిపికి లాభం చేకూరుస్తాడా నష్టం కలిగిస్తాడా త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: