
కానీ తెలంగాణలో అలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వేటికవే పోటీ పడుతున్నాయి. ఇది కేసీఆర్ కు లాభం చేకూర్చేలా ఉంది. జాతీయ స్థాయి లో ఎమ్మెల్యే స్థాయి లెక్కల్లో మోస్ట్ పాపులర్ సీఎం రేసులో మొదటి స్థానంలో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో చత్తీస్ గడ్ సీఎం ఉన్నారు.
ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరని జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తే మాత్రం మొదటి స్థానంలో యోగి ఆదిత్యనాథ్, రెండో స్థానంలో కేజ్రీవాల్, తర్వాతి స్థానాల్లో మమత బెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, హిమంత బిశ్వశర్మ, శివరాజ్ సింగ్ చౌహన్, ఏక్ నాథ్ షిండే, భూపేష్ భగేల్, జగన్ కూడా ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ పేరు లేకపోవడం విచిత్రంగానే ఉంది.
ఇందులో ఏక్ నాథ్ షిండేకు 0.2 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగింది. శివరాజ్ సింగ్ చౌహన్ కు 1.4 శాతం నుంచి 2.4 శాతానికి, హిమంత బిశ్వశర్మ 2.3శాతం నుంచి 2.5 శాతానికి ప్రజాదరణ పెరిగింది. ప్రజాదరణ తగ్గిన వారిలో నవీన్ పట్నాయక్ 3.5 శాతం నుంచి 3.4కు, స్టాలిన్ 5.4 నుంచి 4.6 మమత బెనర్జీ 8.8 నుంచి 7.7 కు తగ్గింది. యోగికి కూడాా కాస్త తగ్గినా, మంచి ఆదరణే ఉంది. కానీ పది స్థానాల్లో సీఎం కేసీఆర్ లేకపోవడం విచిత్రమే.