బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్ అన్న మాటలు నాకు చాలా బాధపెట్టాయన్న  మంత్రి కేటీఆర్.. కేసీఆర్ పాలన అరిష్టం అన్నారని గుర్తు చేశారు. రాజకీయంగా వేరు కావచ్చు కానీ.. మీరు గెలిచి 14 నెలలు గడిచాయి కదా ఏమి చేసారో చెప్పండని.. నిలదీశారు. పెద్దపెద్ద మాటలు చెప్పి ఓట్లు పొంది ఏమి చేసారో చెప్పాలని మంత్రి కేటీఆర్  అన్నారు. తండ్రి లాంటి కేసీఆర్ మాటలు అనవచ్చా  అన్న మంత్రి కేటీఆర్ .. ఇక్కడి నుంచి 33 మంది టికెట్ కోసం పోటీ పడితే ఈటెలకు టికెట్ ఇచ్చి గెలిపించారని గుర్తు చేశారు.


2014 లో  ముడి చమురు ధర  90 డాలర్లుగా ఉందని.. కానీ ఆ నాడు లీటర్ ధర 70 రూపాయలు అయితే ఇప్పుడు 110 ..ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్  ఆరోపించారు. నేను ఆర్దికమంత్రిగా పని చేసా ..కేసీఆర్ వల్ల రాష్ట్రం అప్పుల పాలయ్యిందని ఈటల అంటున్నారన్న మంత్రి కేటీఆర్ .. ఈటెల నియ్యత్ ఉంటే  మాట్లాడాలి ..14 మంది ప్రధానిగా పని చేసిన కాలంలో దేశం అప్పుల పాలయ్యిందా ..ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్  నిలదీశారు.

 
జాతీయ రహదారులు ఇస్తున్నాం కదా అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. .జాతీయ రహదారిలో వెళితే టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని మంత్రి కేటీఆర్  ప్రశ్నించారు. మోదీ దేవుడు అంటారు.. ఎవరికీ దేవుడు .. అమిత్ షా ను చూస్తే టచ్ చేయబుద్ది అవుతుంది అంటున్నారు ..ఇదేం బుద్ధి నిన్ను ఎంపీగా అందుకే ఎన్నుకున్నారా  అని బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గుజరాత్ పాలకులకు గులాములుగా మారాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి కేటీఆర్.. సాదుకుంటారో సంపుకుంటారో అని మళ్ళీ ఓట్లకు వస్తారని ..ఆ మాటలకు పడిపోవద్దని సూచించారు.


రాబోయే ఏడీనిమిది నెలల్లో కౌశిక్ రెడ్డి నాయకత్వంలో బీఅరెస్ ను గెలిపించాలన్న మంత్రి కేటీఆర్ ... హిందు ముస్లిం గొడవలతో మళ్ళి ఓట్లు అడగడానికి వస్తారు ..మాటలకు పడిపోకుండా అభివృద్ధికి ఓటేయాలని కరీంనగర్ జమ్మికుంట ఓటర్లకు గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: