పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ గురించి ఈరోజు కాదు గత రెండు మూడు ఏళ్ళ నుంచి కుంభకోణం జరుగుతూనే ఉంది. ప్రతి పరీక్ష పత్రాన్ని ముందుగానే లీక్ చేయడం, కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం లాంటివి జరుగుతున్నాయని అంటూ మొన్న బండి సంజయ్ ఆరోపణలు, ఆ తర్వాత తాజాగా రేవంత్ రెడ్డి ఆరోపణలు  మొదలైనవి ఘాటుగాటుగా జరుగుతూనే ఉన్నాయి.


ఇవన్నీ పక్కన పడితే ఈ లోపు ఎగ్జామ్స్ రద్దు చేయడం. విచారణకు ఆదేశించడం, విచారణ కు సంబంధించి సిట్లు వేయడం, ఆ సిట్లు ఒక వైపు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం మిగిలిన వారికి కొన్ని నోటీసులు ఇవ్వడం అలా రాజకీయం వైపు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ. వీటన్నింటి మధ్య విచిత్రమైన పరిణామం ఏమిటంటే అందులో నిందితుడిగా పేర్కొన్న రాజశేఖర్ భార్య కోర్టుకు అప్రోచ్ అవ్వడం, హైకోర్టు నుండి సిబిఐ దర్యాప్తు కోరడం అనేది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ జిపి వచ్చేసి నాంపల్లి కోర్టు డైరెక్షన్స్ మీద మేము విచారణ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది.

దీనిపై సీబీఐ విచారణ చేయడమే కరెక్ట్ అంటూ, లేకపోతే ఇక్కడ మా వాళ్ళని హింసించడం కోసమే చేస్తున్నారు, వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకోవడం కోసం మాత్రమే అని ఆయన భార్య కోర్టుకు అప్రోచ్ కావడం అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ గా చెప్పుకోవలసిన విషయం. కెసిఆర్ సర్కార్ అయితే దీంట్లో ఇతర రాష్ట్రాలకు ఇంకా ఇతర దేశాలకు సంబంధం లేదు కాబట్టి కేవలం సిట్ విచారణ అయితే సరిపోతుంది.


కానీ ఈ సిట్ ఎప్పుడైతే రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించిందో, ఆ సిట్ లో ఉన్నటువంటి నైతికత కోల్పోయిందని ఆ పాయింట్స్ మీద సిబిఐ కి వెళ్తుందా లేదంటే సిట్టు పర్లేదు అన్న పాయింట్ కి కోర్టు వస్తుందా అనేది ఇప్పుడు ఇక్కడ తేలాల్సిన విషయం అని తెలుస్తుంది. ఇక ఆపై ఏం జరుగుతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr