
కవితతో చాట్ చేశాను అన్న సుఖేష్ చంద్రశేఖరన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఇదివరకు రెండు సార్లు చెప్పాడు, ఇప్పుడు మూడో సారి వాట్సప్ చాట్ కి సంబంధించి బయట పెట్టాడు . అయితే చాట్ లో ఏం విషయం ఉంది అన్నది చూస్తే,
సుఖేష్ : ఏ.కే బ్రదర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది
కవిత: అవును ఓకే
సుఖేష్: దాన్ని జే.హెచ్ కు పంపించాలా
కవిత: నోనో అరుణ్ ని నీకు కాల్ చేయమని చెప్తా.., దాన్ని ఆఫీస్ కి పంపించాలి
సుఖేష్ : ఓకే అక్క మీరు చెప్పినట్లే చేస్తా
కవిత: అతను నీకు త్వరలో కాల్ చేస్తాడు
సుఖేష్ :దాన్ని ఈరోజే మీకు పంపించాలని ఎస్.జె బ్రదర్ చెప్పారు.
కవిత: అవును
సుఖేష్ : నేను మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటాను అక్క
కవిత: ఓకే అంతా బానే ఉంది కదా, నాన్న ఆరోగ్యం బానే ఉంది కదా
సుఖేష్ : అడిగినందుకు థాంక్స్ అక్క. ఆయన కీమో చికిత్స చేయించుకుంటున్నారు.
కవిత: ఆయన బయటపడతారు
సుఖేష్ : అవునక్కా దేవుడు కరుణిస్తాడు
కవిత: టేక్ కేర్ మళ్ళీ తర్వాత కాల్ చేస్తా
సుఖేష్ : ఓకే అక్క ఎనీ టైం, కెసిఆర్ గారికి నా నమస్కారాలు చెప్పండి
సుఖేష్ : అక్క సరుకు డెలివరీ అయింది
కవిత: ఓకే
సుఖేష్ : అక్క ఏ.కే లేదా ఎస్.జె కి ఇన్ఫామ్ చేయగలరు
కవిత: మనీష్ తో మాట్లాడా
సుఖేష్ : ఓకే అక్క
కవిత: థాంక్స్
ఇది చాట్ లో ఉన్న సంగతి. అయితే ఇక్కడ మనీష్ అంటే మనీష్ డిసౌజియా అని, ఏ.కే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని,
ఎస్.జె అంటే సత్యేంద్ర జైన్ అని వినిపిస్తుంది.
అయితే ఇక్కడ కేజ్రీవాల్ చేసిన తెలివైన పని ఏంటంటే తన చేతికి మట్టంటకుండా మనీష్ డిసౌజియా ఇన్ఫ ర్మేషన్స్ తీసుకుంటూ ఉంటాడని, సత్యేంద్ర జైన్ ఇంకో వైపు అని అంటున్నారు. పైదంతా నిజమా కాదో తేలాలి.