తెలంగాణ లో ఎన్నికలు జరగడానికి ఇక మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. అందుకనే అక్కడ హడావిడిగా మార్పులు చేర్పులు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మార్పులు, చేర్పులు అంటే అర్థం ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే అవకాశం ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, ఆవకాశం లేని వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతారు అని అర్థమట. అయితే  సైలెంట్ గా భారతీయ జనతా పార్టీ లోకి వచ్చేస్తున్న వాళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ వీళ్ళందరూ కొత్తగా  భారతీయ పార్టీలోకి జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది.


అయితే దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి కొంతమంది బయటకు వచ్చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ విషయంపై పొంగులేటీ  ఇంకా జూపల్లి షరతులు కూడా పెట్టారు అన్నట్లుగా తెలుస్తుంది. అదేంటంటే కాంగ్రెస్ అధిష్టానం నుండి రాహుల్ గాంధీ  దూతలు వస్తే  కనుక మొత్తం పార్టీ అంతా అతని చేతికి అప్ప చెప్పేయాలని ఈ పొంగులేటి అంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక జూపల్లి విషయానికి వస్తే టిఆర్ఎస్ ఎలాగూ సీటు ఇవ్వదు కాబట్టి తెలంగాణలో ఆయన సీటు ఆయనకి ఉంటుందని తెలుస్తుంది.


ఇప్పుడు తాజాగా కథలోకి డీకే శివకుమార్ ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. కర్ణాటక ఎలక్షన్స్ తో పాటుగా అక్కడ ముఖ్యమంత్రి సీటుకు రాహుల్ గాంధీ ఒక షరతును పెట్టుకొచ్చారని తెలుస్తుంది. 2024లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలని కోరడమైతే జరిగిందట.  అలాగే తెలంగాణకు సంబంధించిన విజయ అవకాశాలు కూడా మెరుగయ్యలా చూడాలని ఆయన చెప్పారని తెలుస్తుంది.  


ఈ పనులు కనుక చేస్తే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుందని అన్నారట. అయితే అప్పటి వరకు సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారని రాహుల్ చెప్పారట. అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం 2ఏళ్ళు సిద్ధరామయ్య, ఆ తర్వాత డి కే శివ కుమార్ అని తెలుస్తుంది. ఇక తెలంగాణ కర్ణాటక బాటలోనే నడుస్తుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

DKS