పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఇండియాతో కాదు అప్గానిస్తాన్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కు సంబంధించిన యుద్ద ట్యాంకులు, వాహనాలు వెళుతున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ స్థావరాలపై రెండు పెద్ద ఎటాక్ లు జరిగాయి. తెహ్రీకీ తాలిబాన్ల గ్రూపు.. తెహ్రీకి తాలిబాన్ జిహాదీ పాకిస్థాన్ అనే సంస్థలు వరుస బెట్టి పాక్ ఆర్మీ స్థావరాలపై ఎటాక్ చేశాయి. ఇందులో చాలా మంది పాక్ ఆర్మీ సైనికులు చనిపోయారు.


దీంతో పాకిస్థాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇలాగే తాలిబాన్లను ఆయా గ్రూపులను క్షమించుకుంటూ పోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తారని, వారికి తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధమైంది. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి యుద్ద ట్యాంకులు, వెపన్స్ తో కూడిన వాహనాలు వెళుతున్నాయి. ఏ క్షణంలో అయినా పాక్, అఫ్గాన మధ్య యుద్ధం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


కానీ పాక్ ఆర్మీపై జరిగిన దాడికి తాలిబాన్ల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తాలిబాన్లు చెబుతున్నారు. కానీ ఇలాగే విడిచిపెడితే పాక్ ఆర్మీ లో ఉన్న సైనికుల మనో ధైర్యం దెబ్బతినే అవకాశం ఉందని వారు పాక్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఎలాగైనా పాక్ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి తాలిబాన్ల ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి


పాకిస్థాన్ యుద్ధానికి సన్నద్ధం అవుతుంది కానీ దానికి ఇప్పటికే పెట్రోల్, డిజీల్ కొరత వేధిస్తునన కొరత తెలిసిందే. ఇలాంటి సమయంలో కేవలం అప్గాన్ లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని భయ పెట్టేందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ తో యుద్ధం అనేది తాలిబాన్లకు చాలెంజ్ లాంటిది. ఇన్ని రోజులు ఆ దేశంలో అంతర్గతంగా దాడులు చేసిన అనుభవం తప్పా ఏ దేశంతో ప్రత్యక్ష యుద్ధం చేసిన అనుభవం తాలిబాన్లకు లేదు. మరి పాక్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: