కానీ వాళ్ళు ఎవరూ బ్యాంకులకు తిరిగి చెల్లించిన పాపాన పోలేదు. దానితో వీరి వల్ల బ్యాంకింగ్ రంగం అనేది కుదేలైన పరిస్థితి ఏర్పడింది. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అంతే కాక బ్యాంకులను విలీనం చేసే పద్ధతి ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అంతే కాకుండా ఇలా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్న డబ్బు తిరిగి కట్టని వాళ్ళ దగ్గర నుండి కూడా ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని ఆయన అధికారంలోకి రాకముందు ప్రజలకు వాగ్దానం చేశారు.
ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో దాన్ని కార్యాచరణలో పెట్టారు. భారతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత 9 ఆర్థిక సంవత్సరాల్లో, దాదాపు 10 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులను రికవరీ చేశాయి. దేశ ఆర్థిక శాఖా కార్యదర్శి మాట్లాడుతూ, ఆర్థిక ఆస్తుల సెక్యూరిటీ పునర్నిర్మాణం అలాగే భద్రత, వడ్డీ చట్టం 2022అమలు దివాలా కోరు సంస్కృతిని మార్చడానికి సహాయపడిందని అన్నారు.
అలా తాను ఇచ్చిన మాట ప్రకారం 2016లో ఒక చట్టం, 2022లో ఒక చట్టం తీసుకువచ్చారు మోడీ. వీటి ప్రకారం సొమ్ము ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కున్న విజయ్ మాల్యా లాంటి వాళ్ల దగ్గర నుంచి కూడా సొమ్మును రాబట్టవచ్చు. ఆ విధంగా వాళ్ల దేశాలలో చట్టాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారు నరేంద్ర మోడీ. మరి ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి