ఇప్పుడు ఏపీ రాజకీయాలు పురంధేశ్వరి చుట్టూనే తిరుగుతున్నాయి.  చంద్రబాబు అరెస్టు తర్వాత ఆమెను టీడీపీ నాయకురాలిగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక ఇసుక తవ్వకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయని.. మద్యం కుంభకోణం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు సోము వీర్రాజు ను ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల తప్పించి ఆ పదవిని ఆమెకు కట్టబెట్టారు.  దీంతో పార్టీ బలోపేతం అవుతుంది అని భావించారు. ఆమె కూడా ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు.  


బీజేపీ అధ్యక్షురాలిగా తనకు తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని పురంధేశ్వరికి పలువురు రాజకీయ నేతలు సూచిస్తున్నారు.  ఆమె పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనే అంశంపై విశ్లేషణ జరపాలని కోరుతున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ అధిష్ఠానం స్పందించలేదు. కానీ పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికంగా జరిగింది అని.. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.  చంద్రబాబు అరెస్టు విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే కోర్టే ఆ కేసును కొట్టివేసేది. కానీ ఇప్పుడు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.


చంద్రబాబును అరెస్టు చేసిన తొలి రెండు రోజుల్లో ఆ తరహా ఆరోపణలు చేశారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు అవినీతి జరిగింది అని ఆధారాలు చూపుతున్నా ఆమె ఇంకా అప్రజాస్వామికం అని చెప్తూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ విషయంలో చర్చ అనవసరం అని తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు అని తెలిపారు.  ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో వైసీపీ నేతలు కూడా బీజేపీ, టీడీపీ ఒకటే అని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ బలహీనపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp