వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని భావించి కొంతమంది అధికారులు చెలరేగిపోయారు. తీరా చూస్తే ఈ నెల 4న టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఆయా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గనుల శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారి స్వామి భక్తి చాటుకున్నారు. ఆ శాఖలో తిరిగి తానే కీలక పోస్టులో ఉంటానని భావించి ఇష్టారీతిన వ్యవహరించారు.  నిధులను దారి మళ్లించారు.  ప్రభుత్వం మారడంతో తమ అవినీతి, అక్రమాల లోగట్టు భయపడటం ఖాయమని గుర్తించిన దొంగలు తమ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు.


మంగళగిరిలోని ఓ స్టార్ హోటల్ రూమ్ ను తీసుకొని అక్కడి నుంచే మంత్రాగాన్ని నడిపారు. నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులకు వాంటెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పిలిపించుకొని అతని ద్వారా గనుల శాఖ డైరెక్టరేట్ లోని కంప్యూటర్లలోకి ఆన్ లైన్ ద్వారా చొరబడి, సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మరోవైపు ప్రభుత్వం తమకు ఇచ్చిన ల్యాప్ టాప్లలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించి వాటిని రికవరీకి సాధ్యం కానీ రీతిలో ఫార్మాట్ చేసినట్లు తెలిసింది. పెద్ద అవినీతి తోడేలుకు అండదండలు ఉండటంతో ప్రభుత్వ సొమ్మును కాజేసిన మరో ముగ్గురు సీనియర్లు ఈ మంత్రాంగంలో పాల్గొన్నట్లు తెలిసింది.


గనుల శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఒ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును కొందరు ఉన్నతాధికారులు.. చిరుద్యోగుల సహకారంతో కాజేసిన విషయం ఎల్లో మీడియాలో వచ్చింది. ప్రస్తుతం రెండు ఆఫీసులను ప్రభుత్వం సీజ్ చేయడంతో భౌతికంగా కార్యాలయాలకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో ఇంటర్నెట్ సేవలను వినియోగించుకొని డైరెక్టరేట్ సర్వర్ ని హ్యాక్ చేసి డేటాను, దాంతో పాటు లాగ్స్ ని తొలగించే పన్నాగం పన్నారు. అందుకే ఓ ఐటీ ఇంజినీర్ సాయంతో ఈ పని చేయించాలని అనుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ముగ్గురు ఉన్నతాధికారులకు సంబంధించి ఫైల్ డేటా లాగ్స్ తొలగించినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: