పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనగాని మాట్లాడుతూ, ఏడెనిమిది కొత్త జిల్లాల ఏర్పాటుకు వినతులు వచ్చాయని, అయితే జిల్లాలు చిన్నగా ఉంటే పరిపాలనా ప్రయోజనం ఉండదని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు చెప్పారు. పోలవరం ముంపు మండలాలను ఏ జిల్లాలో కలపాలనే అంశంపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని చర్చించినట్లు ఆయన వివరించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తుది నివేదిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పరిపాలన సౌలభ్యం కోసమే జరుగుతుందని, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఏర్పాటైన 26 జిల్లాల విభజన వల్ల సమస్యలు ఎదురయ్యాయని, ఈ సమస్యలను సవరించడానికి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్చలు జరిగాయని, త్వరలోనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి