ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రవచనాల కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి నైతిక విలువలపై ప్రజల్లో చైతన్యం కలిగించే బాధ్యత తనకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలో తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల మధ్య ప్రేమ వాత్సల్యం కరువవుతోందని చెప్పారు. చంద్రబాబు తన తల్లి నుంచి కష్టపడటం నేర్చుకున్నారని ఒక వ్యాసంలో రాశారని గుర్తు చేశారు. తల్లిని మించిన దైవం లేదని ఉద్ఘాటించారు. భగవంతుడు ఇచ్చిన వరం కుటుంబమని వివరించారు.

స్త్రీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుతుందని తెలిపారు. అమ్మలాంటి వ్యక్తి లేడని అమ్మకు చెప్పలేని పని చేయరాదని సలహా ఇచ్చారు. అలా చేస్తే ద్రోహమని హెచ్చరించారు.టంగుటూరి ప్రకాశం పంతులు తన చదువు కోసం అమ్మ పట్టుచీర అమ్మి డబ్బు ఇచ్చిందని తన జీవిత పుస్తకంలో రాశారని చాగంటి పేర్కొన్నారు. అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు పిల్లలు కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారని అభిమానం చాటారని చెప్పారు. మహాత్ముల జీవితాలు చదవాలని వారి గొప్పతనం ప్రేరణనిస్తుందని సూచించారు. క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయ చిన్నతనంలో పడిన కష్టం స్ఫూర్తిదాయకమని తెలిపారు.

ప్రతి విద్యార్థి అమ్మను గౌరవించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరుపేద కుటుంబంలో పుట్టారని బూట్లు లేకుండా తల్లి పెంచిందని చెప్పారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ పుట్టిన పది రోజులకు తల్లి చనిపోయిందని తనను కనడానికి బతికిందని రాశారని వివరించారు.తల్లి ఎంత గొప్పదో తండ్రి అంతే గొప్పవాడని చాగంటి అన్నారు. పిల్లల వృద్ధి కోరేది తండ్రని తన కంటే కొడుకు గొప్పవాడైతే ఆనందిస్తారని అసూయపడరని చెప్పారు.

ఏ త్యాగం చేయడానికైనా కష్టపడతారని తెలిపారు. అబ్రహం లింకన్ తన తండ్రికి గౌరవం ఇచ్చారని లతా మంగేస్కర్ చిన్నతనంలో తండ్రి హిందుస్తానీ సంగీతం నేర్పారని డిల్ రుబా బహుమతి ఇచ్చారని వివరించారు. బహుమానాలపై ఆసక్తి పెంచుకోకుండా కళపై ఆసక్తి పెంచుకోమని తండ్రి సూచించారని చెప్పారు. మోసం చేయడం మంచిది కాదని తండ్రి మాట పిల్లలను చిక్కుతుందని తండ్రి వ్యధ పిల్లలు బాగుపడాలనేనని ఉద్ఘాటించారు. తల్లిదండ్రుల మాట వింటే నైతిక విలువలు అలవడతాయని సలహా ఇచ్చారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: