ప్రస్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రోజులు గ‌డుస్తున్నా క‌రోనా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. కనీసం బలహీనపడుతున్న సూచనలు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య ఆరు ల‌క్ష‌లు దాట‌గా.. పాజిటివ్ కేసులు 1.42 ల‌క్ష‌లు దాటేసింది. 

 

మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు భర్తీ చేయ‌డానికి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 11 ఖాళీలను ప్ర‌క‌టించింది. హెచ్ఆర్, మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ వంటి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తోంది. వీటి వివరాలు చూస్తే.. మొత్తం 11 ఖాళీల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్ఆర్)- 6, మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)- 3, మేనేజ్‌మెంట్ ట్రైనీ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)- 2 పోస్టులున్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో డిగ్రీ పాస్ కావడంతో పాటు ఎంబీఏ పాస్ కావాలి. 

 

అలాగే అభ్యర్థులు 2020 లో యూజీసీ నెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. ఎందుకంటే..  యూజీసీ నెట్ 2020 పరీక్షలో మెరిట్‌తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు.ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. కాగా,  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ‌మైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 10 ఆఖ‌రు తేదీ. ఆస‌క్త‌గ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల కోసం  https://www.vizagsteel.com/వెబ్‌సైట్ ఓపెన్ తెలుసుకోవ‌లెను. ద‌ర‌ఖాస్తు కూడా ఇదే వెబ్‌సైట్‌లో చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: