నాటి నుంచి నేటి వరకు అమ్మాయిలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా మానసికంగా వారు  ఎన్నో సమస్యలకు లోనవుతున్నారు. అందుకు తగ్గట్టుగా కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆడ పిల్లలకు సహాయం చేయడం లేదు. చదువుకుంటాం అమ్మా బడికి పంపించండి అని అంటున్నా కూడా మీకు చదివి ఎందుకు  అని వారు వాధించి,వారికి ఇంటి పని, వంట పని నేర్పించేస్తున్నారు. ఇక అబ్బాయిలకు మాత్రం దర్జాగా, ధీమాగా చదువులు చెప్పించి పైగా వారికి ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నారు.అమ్మాయిలకు చదువుల సరస్వతి అని పేరు ఉన్నప్పటికీ వారు చదువుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు. అందులో ఒకటి ముఖ్య కారణం ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడమే. ఇప్పుడు ఇలాంటి వారి కోసమే ఇంటర్న్ శాల  చాలా వినూత్నమైన పద్ధతిలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే  ఇంటర్న్ శాల ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వారి కోసమే సరికొత్త స్కాలర్షిప్ పేరిట వారికి ఆర్థికంగా సహాయపడాలనుకుంటోంది. ఇందుకోసం 17 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలు అర్హులు అని సూచిస్తోంది. స్టడీ,స్పోర్ట్స్ వంటి తదితర రంగాలకు సంబంధించిన అమ్మాయిలు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అమ్మాయిలు ఇందుకోసం చేయవలసిందల్లా వారి వయస్సు, విద్యార్థినిలు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు,సాధించిన విజయాలు,స్కాలర్ షిప్ ను పొందితే ఈ  స్కాలర్ షిప్ను ఎందుకు వినియోగిస్తారు? అనే విషయాలకు సంబంధించి స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ విధానం  జరుగుతుంది.

అయితే ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలకు టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరగుతుంది.https://blog.internshala.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ 15 జనవరి 2021.ఈ లింకు ఓపెన్ చేయగానే అక్కడ మీ చదువుతో పాటు మీ పూర్తి వివరాలు అక్కడ నమోదు చేసుకోవాలి. స్కాలర్షిప్ ఎంపిక విధానం తర్వాత సెలెక్ట్ అయిన ప్రతి ఒక అమ్మాయికి 25 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు ఇంటర్న్ శాల  ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: