సింగరేణిలో ఈ ఏడాది తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 651 ఖాళీ లను భర్తీ చేస్తామని ఇటీవల సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. తొలి విడత 372 ట్రైనీ ఉద్యోగా లకు ఆ సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. 128 ఫిట్టర్, 51 ఎలక్ట్రీషియన్, 54 వెల్డర్, 22 టర్నర్/మెషినిస్టు, 14 మోటారు మెకానిక్, 19 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 84 జూనియర్ స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు సర్కార్ పేర్కొంది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. స్థానిక రిజర్వేషన్ కింద భర్తీ చేయనున్న వాటిలో 105 ఫిట్టర్, 43 ఎలక్ట్రీషియన్, 44 వెల్డర్, 18 టర్నర్/మెషినిస్టు 18, 16 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 67 స్టాఫ్ నర్సు, 12 మోటారు మెకానిక్ పోస్టులున్నాయి. అభ్యర్థులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 4 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీని సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చివరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆ సంస్థ జీఎం ఆనందరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నోటిఫికేషన్ వల్ల కొంత వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి