పూర్తి శిక్షణ పూర్తి చేసి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసారు.ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెన్ తదితర విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇకపోతే ఏదైనా స్టేట్ బోర్డులో 8వ తరగతి పాసైన్ వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ విభాగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి.
12వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు డీసీఏ, పీజీడీసీఏ కోర్సుల్లో ఏడాdr కోర్సు చేసి ఉండాలి. ఇంగ్లిష్, హింది టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉండాలి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు.ఆసక్తి కలిగిన విద్యార్థులు మరియు నిరుద్యోగులు కూడా www.beciljobs.com వెబ్ సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
పరీక్ష ఫీజు వివరాల విషయానికొస్తే..జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 590ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రూ. 295గా నిర్ణయించారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి