నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ కంపెనీ బెల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసారు..ట్రైనీ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మిలిటరీ కమ్యూనికేషన్ ఎస్‌బీయూ, బెంగళూరు కాంప్లెక్స్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 మే 21 చివరి తేదీ. ఇవి ఏడాది కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. సంస్థ అవసరాలు, వ్యక్తిగత పనితీరును బట్టి మూడేళ్ల వరకు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. 


ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్ ‌లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్ ‌లో దరఖాస్తు చేయాలి. ప్రయాణాలు ఇష్టపడేవారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు...ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు మొదటగా బెంగుళూర్ లో ఉద్యోగాలు చేయాల్సి ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్‌తో పాటు ఫీల్డ్ యాక్టివిటీస్‌లో భాగంగా దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఒక థ్రిల్లింగ్ జాబ్ అనే చెప్పాలి.

ఈ ఉద్యోగాలకు ఉన్న ఖాళీలు..

ట్రైనీ ఇంజనీర్ మొత్తం ఖాళీలు- 30
జనరల్- 12
ఓబీసీ- 8
ఎస్సీ- 4
ఎస్టీ- 3
ఈడబ్ల్యూఎస్- 3

ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు మరియు గుర్తుంచు కోవాల్సిన అంశాలు.. 

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 21


విద్యార్హతలు- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ అండ్ టీ, టెలీకమ్యూనికేషన్‌ లో నాలుగేళ్ల బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి.

అనుభవం- అభ్యర్థుల కు 6 ఏళ్లు ఇండస్ట్రీ లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి 25 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు లకు ఫీజు లేదు.

వేతనం- మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడో ఏడాది రూ.31,000.


ఈ ఉద్యోగాల కు ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: