సహదేవ్ సహారన్ ఆయనేమన్నా ధనవంతుల వ్యక్తి అనుకునేరు. పేద మధ్య తరగతి సాదాసీదా కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. రోజా, మంజు, అన్షు, రీతు, సుమన్ ఐదుగురు ఆయన బిడ్డలే. ఆయనకు కొడుకు లేరని ఏనాడు కూడా బాధ పడలేదు సహదేవ్. అయితే సహదేవ్ కు కలెక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. కానీ పేదరికం కారణంగా కాలేకపోయాడు. కానీ తన కుమార్తెలకు తరచూ కలెక్టరు కోరిక నెరవేర్చాలని చెప్పేవాడు. దీంతో తండ్రి మాటపై వారు చిన్నప్పటినుంచి కలెక్టర్ కావాలని ఆశయంతో కష్టపడి ఉన్నత చదువులు చదివారు. అలా చదవడమే కాకుండా తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని ఇప్పుడున్న యువతకు ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. ఇంత గొప్ప కుటుంబం రాజస్థాన్ లోని హనుమషురూలో నివాసం ఉంటుంది. 2018లో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు మంగళవారం విడుదలవ్వగా ఇందులో అన్షు, రీతు, సుమన్ లు ఒకే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లకు ఎంపికై రాజస్థాన్ మొత్తం చరిత్ర సృష్టించారు. రాజస్థాన్లో యువతులే హాట్ టాపిక్ గా మారారని చెప్పవచ్చు.
ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజుల కలెక్టర్ కొలువులో ఉన్నారు. ప్రస్తుతం మిగిలిన ముగ్గురు కూడా ఆర్ ఏయస్ కు ఎంపిక కావడంతో ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ ఆఫ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో నెటిజన్లు అంతా ఈ అక్కాచెల్లెళ్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కష్టపడి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించగలమని ఈ అక్క చెల్లెలు నిరూపించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి