మొన్నటి వరకు దాదాపు రూ.50 వేలకు చేరువలో ఉన్న బంగారం ఇప్పుడు క్రమేనా తగ్గుముఖం పట్టింది.  ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం దీనిపై పడుతుందని అంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కరోనా వల్ల సమ్మర్ సీజన్ మొత్తం జనాలు ఇంటి వద్దనే గడిపారు.. లాక్ డౌన్ కారణంగా శుభకార్యాలన్నీ రద్దైన విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా రెండోరోజు బంగారం ధరలు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలల్లో ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.  బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

 

బంగారం ధర తగ్గితే.. పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ.800 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.47,900కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక హైదరాాబాద్ లో  గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.920 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,310కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.

 

10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గుదలతో రూ.48,090కు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.46,000 వద్దనే ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. అంతే కాదు ఇక కేజీ వెండి ధర పడిపోయింది. రూ.800 తగ్గుదలతో రూ.47,900కు పతనమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: