అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.3% తగ్గి 2029 డాలర్లకు చేరుకుంది. గత నెలరోజులతో పోలిస్తే ధర 6.6 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు కేవలం జూలై నెలలో మాత్రమే 11 శాతం పైగా పెరిగాయి. ఇకపోతే ఈ నెలలో మాత్రం ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికొస్తే... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 230 తగ్గి రూ.58,470 గా ముగిసింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయలు తగ్గి రూ.53,580 గా చేరింది.
ఇక వెండి ధర విషయానికి వస్తే నేడు ఏకంగా రూ 900 రూపాయలు పెరిగి రూ.75,150 కి చేరుకుంది. ఓ వైపు దేశం లో కరోనా కేసులు అమాంతం పెరుగుతుండగా మరోవైపు బంగారం వెండి ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి. రాను రాను బంగారం, వెండి ధరలు చూసి సామాన్యులు అటు బీదవారు కొనే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల దుష్ట అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఇన్వెస్టర్లు ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారు, వెండి, కమిటీలలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతున్నారు. దీనితో డిమాండ్ ఎక్కువ కావడంతో రోజు రోజుకి బంగారం వెండి ధరలు అందుకోలేనంత పైకి వెళ్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి