పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి.. నిన్నటిదాకా కొంతవరకు తగ్గిన ఊరట నిచ్చిన బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. దసరా పండుగకు కాస్త తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.కరోనా ప్రభావంతో రవాణా లేక పెరిగిన ఈ బంగారం ధరలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. రోజు రోజుకు ఒక ధర వినపడుతుంది.ఈరోజు కూడా పసిడి ధర భారీగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర ఒక్కసారిగా తారా స్థాయికి చేరింది.



హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరుగుదలతో రూ.52,220కు చేరింది.  అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.740 పెరిగింది. దీంతో ధర రూ.47,870కు పెరిగింది. బంగారం నిన్నటి వరకు 47 వేలలో ఉండగా, ఈరోజు ఏకంగా 810 పెరగడంతో పసిడి ప్రియులు నిరాశకు లోనయ్యారు. రేట్లు భారీగా పెరగడంతో అందరూ వెండి వస్తువులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు..



ఇక బంగారం పెరిగితే, వెండి పెరుగుతుంది. మొత్తానికి వెండి ధరలు కూడా ఈ ధర ల పై ఆధారపడుతున్నారు. బంగారం రేట్ల దారిలోనే పయనిస్తున్నాయి.కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,100కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్  పూర్తిగా పడిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం తగ్గుదలతో 1908 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.58 శాతం క్షీణతతో 24.43 డాలర్లకు దిగింది. మరి దీపావళి కి ఇంకాస్త పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   రేట్లు పెరగడంతో వెండి వస్తువుల పై మక్కువ చూపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: