దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ .7 పెరిగి రూ. 46,503 కి చేరింది. గత ట్రేడ్‌లో ఈ విలువైన పసిడి లోహం 10 గ్రాములకు రూ. 46,496 కి తగ్గింది. వెండి కూడా కిలో రూ .198 పెరిగి రూ .63,896 కి చేరుకుంది. క్రితం ట్రేడ్‌లో ఇది కిలోకు రూ .63,698 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,783 డాలర్లుగా ఉంది. కాగా వెండి ధర .ఔన్స్‌కు 24.18 డాలర్లుగా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం ధర విషయానికొస్తే... 22 క్యారెట్లు బంగారం రూ. 44,550, 24 క్యారెట్లు బంగారం రూ.48,500,

అక్టోబర్ 25 నుండి ఐదు రోజుల పాటు 2021-22 సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) తదుపరి విడతలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 2021-22 శ్రేణి బంగారు బాండ్ల కింద, బాండ్లు అక్టోబర్ 2021 మరియు మార్చి 2022 మధ్య నాలుగు దశల్లో జారీ చేస్తారు. ఈ సిరీస్ కింద మే 2021 నుండి సెప్టెంబర్ 2021 వరకు ఆరు దశల్లో బాండ్లు జారీ చేశారు.

2021-22 సిరీస్-8 కోసం సబ్‌స్క్రిప్షన్ కాలం అక్టోబర్ 25 నుండి అక్టోబర్ 29 వరకు ఉంటుందని, బాండ్లను నవంబర్ 2 న జారీ చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బాండ్లను బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు పేమెంట్ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIS), కొన్ని  పోస్ట్ ఆఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మరియు బొంబాయి) జారీ చేస్తాయి. అందులోనే స్టాక్ ఎక్స్ఛేంజ్ విక్రయం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: