మన దేశంలో చిన్న శుభకార్యాల నుండి పెద్దపెద్ద పంక్షన్ వరకు మహిళలు బంగారం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారం రేటుతో సంబంధం లేకుండా వారిదగ్గర ఉన్నంతలో కొంచమైనా బంగారం కొనుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే గత కొద్దిరోజుల నుండి పెరుగుతున్న వస్తున్నా పసిడి ధర నిన్న స్థిరంగా ఉంది. బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామా.

ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అయితే నగలకు ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్న రూ. 44,990లు ఉండగా రూ 20 తగ్గి, నేడు రూ. 44,970కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న రూ. 49,090లు ఉండగా నేడు రూ. 20 మేర తగ్గి 10 గ్రాములు రూ.49,000కి చేరింది. అయితే ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు స్థిరంగానే ఉన్నాయి.

మన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధర స్థిరంగానే ఉన్నాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా కొనసాగుతుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్థిరంగానే ఉన్నాయి. అయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ47,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ 51,430గా కొనసాగుతుంది. ఇక దేశంలో ప్రధాన నగరమైన చెన్నైలో నేడు  22 క్యారెట్ల బంగారం ధర రూ.45,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420కి చేరుకుంది.

ఇక ప్రస్తుతం పసిడికి ఎంత డిమాండ్ ఉందో వెండికి కూడా అంతే డిమాండ్ పెరిగింది. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. మరోవైపు వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇక నేడు కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. అయితే దేశంలో నేడు కేజీ వెండి ధర రూ.65,800కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: