దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం – వెండి ధరలు పెరగడం కొత్తేమీ కాదు కానీ గత తొమ్మిది నెలలుగా విపరీతంగా పెరుగుతున్న రేట్లు సాధారణ ప్రజలకు మింగుడు పడట్లేదు. “ఇంతకుముందు ఎప్పుడూ ఇలా పెరగలేదు” అని మార్కెట్ నిపుణులే అంటున్నారు. ఇకపై ధరలు తగ్గే పరిస్థితి కనీసం కనబడడం లేదు. బంగారం మీద ఎవరు తగ్గిన డిమాండ్ చెప్పినా అది కేవలం ఊహ మాత్రమేనని, వాస్తవానికి బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదని విశ్లేషకులు చెబుతున్నారు. పండగల సీజన్‌లో మరింత హైక్! .. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం ధరలు ఇంకా ఎగిసిపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 

“ఇప్పుడే కొనండి, రేపు కొనాలని ఆలోచిస్తే మళ్లీ మోసపోతారు” అని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కొంటే పెట్టుబడి అన్నట్టే లాభం ఉంటుందని భావిస్తున్నారు. కొందరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు తగ్గితే ధరలు కొంత వరకు దిగి రావచ్చని చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే బంగారం తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. పెట్టుబడిదారులలో సందేహాలు ..  బంగారం కొనుగోలుపై పెట్టుబడి పెట్టేవారు సైతం వెనకడుగు వేస్తున్నారు. “బంగారం నిజంగా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌నా? లేక ఇలాగే పెరిగిపోతుందా?” అన్న సందేహం వారిని కుంగదీస్తోంది. అయితే చాలా మంది మాత్రం “బంగారం కొనడం ఎప్పుడూ మోసం కాదు. నష్టం వచ్చే పరిస్థితి రాదు” అని అంటున్నారు.



ఈరోజు బులియన్ రేట్లు ..  తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,790, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,11,050గా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ. 1,42,900గా నిలకడగా కొనసాగుతోంది. అంటే పెద్దగా ఊరటేమీ లేకపోయినా కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌లో నిపుణులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు – “బంగారం రేట్ తగ్గే అవకాశాలు చాలా సన్నం. అవసరమైనప్పుడు తీసుకున్నా మంచిదే, ఆలస్యం చేస్తే మరింత ఖర్చవుతుంది.”

మరింత సమాచారం తెలుసుకోండి: