ఉసిరికాయను తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మన ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగించే త్రిఫలాల్లో ఉసిరికాయ కూడా ఒకటి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఉసిరికాయలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ ఇంకా విటమిన్ సి వంటి చాలా పోషకాలు ఉన్నాయి. పచ్చి ఉసిరికాయలతో పాటు ఎండిన ఉసిరికాయల్లో కూడా ఈ పోషకాలనేవి ఉంటాయి.ఈ ఉసిరి కాయలను ఎండబెట్టి మనం సంవత్సరం పొడవునా తీసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఉసిరికాయలతో జామ్ ను చేసి తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీనితో జామ్ ను తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీరు 100 గ్రాముల ఎండు ఉసిరికాయలను తీసుకోవాలి. వీటిని అర లీటర్ నీటిలో వేసి బాగా మెత్తగా ఉడికించాలి.ఆ తరువాత వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అరకిలో బెల్లం కూడా తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులోనే కొద్దిగా నీటిని పోసి వేడి చేయాలి.ఇక బెల్లం కరిగి తీగ పాకం వచ్చిన తరువాత ఉడికించిన ఉసిరికాయ పేస్ట్ ను వేసి కలపాలి. ఆ తరువాత దీనిని జామ్ లాగా అయ్యే దాకా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఇక ఇలా చేయడం వల్ల ఉసిరికాయ జామ్ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేయడం వల్ల చాలా కాలం పాటు అది తాజాగా ఉంటుంది. ఈ జామ్ ను ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అలాగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే మన కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ జామ్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: