ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక్క మాస్క్ కాకుండా రెండు మాస్క్ లను ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక సర్జికల్ మాస్క్ ధరిస్తే 56.1 శాతం వరకు కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. అదే ఒక క్లాత్ మాస్క్ అయితే 51.4 శాతం వరకు రక్షణ అందుతుంది. అయితే రెండు మాస్క్ లను కలిపి ధరించడం వల్ల 85.4 శాతం కోవిడ్ నుంచి మనల్ని రక్షించుకోవచ్చు.