.రోజు 2 కప్పులపాలు .గుడ్లు,  10 గ్రాము నట్స్,  1 కప్పు మీగడలేని పెరుగు. .2-4 పళ్లు (వాటిలో ఒకటి సిట్రిన్ ఫలం వుండాలి. ఇది సి-విటమిన్ అందిస్తుంది.).  .వారంలో 5 సార్లు పాలకూర, మెంతికూరలు(దీనివల్ల విటమిన్ ప్లస్ ఐరన్ అందుతుంది. శరీరానికి) తీసుకుంటుండాలి. . గొదమనూక, సెరల్స్, పొట్టుబియ్యం, బ్రెడ్తో తయారయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫైబర్, విటమిన్-, ఫొలిక్ యాసిడ్ లభిస్తుంది. గర్భం దాల్చిన 3 నెలల వరకు ఈ ఫోలిక్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది శిశువుకి పుట్టుకతో వచ్చే లోపాలను రాకుండా నిరోధిస్తుంది.  ఉదాహరణకు న్యూరల్ ట్యూబ్ లోపాల వంటివి. .ప్రెగ్నెంట్ స్త్రీలు రోజుకి కనీసం 80 గ్రాములు ప్రొటీన్లు గల ఆహారం తీసుకోవాలి.  ఈ విలువలు అత్యధికంగా గల గుడ్డు, పాలు, బీన్సు, పెద్దశనగలు. చికెన్, చేపలను భుజిస్తుండాలి. .ఒమెగా-3 ఫాటీ యాసిడ్స్ తో కూడిన చేపలు, వాల్నట్స్, కనొలా ఆయిల్ని తీసుకోవడం చాలా అవసరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: