సాధారణంగా మెట్లు ఎక్కాలి అంటే అబ్బో మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, అంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం లిఫ్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత,  ఇక మెట్లు ఎక్కడాన్ని పూర్తిగా మానేశారు. అయితే మెట్లు ఎక్కడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..


రోజు మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేయడం వల్ల అటు శరీరానికి,  ఇటు శారీరక  దృఢత్వానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు.. అయితే అటు ఆరోగ్యంగా ఇటు ఫిట్ గా ఉండాలి అంటే వారానికి మూడు నుంచి ఐదు రోజుల పాటు, కనీసం రోజుకు అరగంట పాటు మెట్లు ఎక్కడం, దిగడం లాంటి వ్యాయామం చేయాలి అంటున్నారు.


అంతేకాకుండా మెట్లు ఎక్కి, దిగేటప్పుడు షూ వేసుకోవడం ఇంకా మంచిది. అయితే ఇవి మడమ భాగంలో మందంగా, మెత్తగా, ఫ్లెక్సిబుల్ గా ఉండే లాగా చూసుకోవాలి. శరీరంలోని కండరాలు దృఢంగా మారుతాయి. చాలామందికి తొడల భాగం బాగా లావుగా ఉండి, మిగతా భాగం సన్నగా ఉంటుంది. ఇలాంటి వారు కూడా రోజూ మెట్లెక్కి దిగడం వల్ల తొడ భాగంలో ఉన్న కొవ్వు ఇట్టే కరుగుతుంది..


ఇక మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. తద్వారా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా ఎక్కువ. కానీ మెట్లు ఎక్కి దిగేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారు కూడా శరీరంలోని అనవసర క్యాలరీలను తగ్గించుకోవడానికి ఈ వ్యాయామం మంచిగా పని చేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి ఏడు క్యాలరీల వరకు ఖర్చు అవుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది..

మరింత సమాచారం తెలుసుకోండి: