1). పియర్
శీతాకాలంలో ఈ పండు తినడం వల్ల చాలా సులువుగా అరుగుదల అవుతుంది. ఇక దీని రసం కూడా చాలా చాలా మంచిది. ఇది మన శరీరంలో ఉండే ప్రేగులను సురక్షితంగా ఉంచుతుంది. ఇక ఇందులో విటమిన్ సి, ఇ బాగా లభిస్తుంది.
2). దానిమ్మ:
శీతాకాలంలో బాగా దొరికేటటువంటి పండు దానిమ్మ. ఈ పండు లోని గింజలు శరీరంలోని రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి. ఈ చలి కాలంలో రక్తం కు సంబంధించి, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుచేతనే వీటిని తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఇది చర్మాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.
3). ఆపిల్:
ఇక ఇది చాలా ఖరీదైన పండు. ఇది ఎక్కడైనా అన్ని సీజన్లలో దొరుకుతుంది. మనం ఫిట్ గా ఉండాలంటే వీటిని కచ్చితంగా తింటూ ఉండాలి. ఇందులో విటమిన్-A, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతే కాకుండా మెదడు కూడా బాగా పనిచేస్తుంది.
4). జామకాయ:
శీతాకాలంలో ఈ పండును తినకూడదని ఎంతోమంది చెబుతుంటారు.కానీ ఈ కాలంలోనే ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాలంలో ఈ పండు తినడం వల్ల పొట్ట మొత్తం శుభ్రం అవ్వడమే కాకుండా జలుబు నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఇవే కాకుండా అరటి, రేణి గాయలు, కమలా పండు వంటివి తినడం చాలా మేలట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి