ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు కూడా చాలా సినిమాలు విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న భర్త మహాశయుకు విజ్ఞప్తి , నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అలాగే శర్వానంద్ హీరో గా రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి మూవీ లను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో ఇప్పటివరకు ఉన్న లెక్క ప్రకారం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు ఐదు తెలుగు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి.

ఇకపోతే మధ్య సంవత్సరం సంక్రాంతి పండక్కు చాలా సినిమాలు విడుదల కానుండడంతో  రవితేజ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాలేదు. కొంత కాలం క్రితం రవితేజ నటించిన ఈగల్ మూవీ ని సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ సంవత్సరం సంక్రాంతి పండగకు చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఏదైనా ఒక మూవీ వెనక్కు తగ్గాలి అనే ఉద్దేశంతో రవితేజ తాను నటించిన ఈగల్ మూవీ ని సంక్రాంతి పండక్కు కాకుండా తర్వాత విడుదల చేశాడు.

మరి రవితేజ ఈ సారి కూడా అందరూ హీరోలకు రిలీఫ్ ఇవ్వడం కోసం తాను ఏమైనా వెనకకు అడుగు వేస్తాడా అని ఆయన అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రవితేజ హీరోగా రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గనుక సంక్రాంతి కి విడుదల అయినట్లయితే మంచి విజయాన్ని సాధిస్తుంది అని చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: